చంటి ఛానల్,నిజామాబాద్: ‘ప్రజా పాలన’లో భాగంగా బోధన్ 26వ వార్డులో పర్యటించిన జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇతర పథకాల కోసం ఎవరైనా కమిషన్లు అడుగుతున్నారా అని ప్రశ్నించగా.. కౌన్సిలర్ దామోదర్ రెడ్డి (దాము) అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నారని ప్రజలు బదులిచ్చారు. వరుసగా 3 సార్లు గెలిచిన దాము, నిత్యం ఉదయం 6 గంటలకే వార్డులో పర్యటిస్తూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఇలాంటి కౌన్సిలర్ దొరకడం వార్డు ప్రజల అదృష్టమని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.

