చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. మినీ జెసిపి సహాయంతో వార్డులోని మురికి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే ప్రక్రియను చేపట్టిన అధికారులు, పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు చెత్తాచెదారాన్ని కాలువల్లో వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఇంద్ర కిరణ్, యువజన అధ్యక్షులు తలారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

