Explore

Search

November 7, 2026 6:11 pm

కల్లూర్కిలో హిందూ సమ్మేళన గర్జన!

చంటి ఛానల్,బోధన్: హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో కల్లూర్కి ఉపమండల పరిధిలోని పలు గ్రామాల (కల్లూర్కి, సిద్ధాపూర్, ఖండ్‌గాం, బిక్నెల్లి, కొప్పర్ల, హంగర్ల, బండారుపల్లి, రాంపూర్) ప్రజలతో కలిసి భారీ ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ నెల 29-03-2026, ఆదివారం ఉదయం 9:00 గంటలకు స్థానిక Z.P.H.S. పాఠశాల కల్లూర్కి ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే సమూహిక హనుమాన్ చాలీసా పారాయణానికి ముఖ్య అతిథులుగా సిద్దిరామేశ్వర ఆలయ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ష.బ్ర 108 సిద్ధగిరి సదాశివ మహంత్ మహాస్వామీజీ (బిక్కనూర్), మహాదేవ్ ధర్మ పీఠం గుడిమెట్ కి చెందిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మజాగరణ నిధి ప్రముఖ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ సత్సంగ్ ప్రముఖ్ శ్రీరాంరెడ్డి, RSS తెలంగాణ సహ ప్రాంత ప్రముఖ్  కల్వకుంట్ల ప్రభుకుమార్ ప్రధాన వక్తలగా పాల్గొని ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్