చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి గారు జైలు శిక్ష, జరిమానా విధించారు. పెగడపల్లికి చెందిన వై. వెంకటరమణకు ₹10,000 జరిమానా తో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష, రాకసిపేట్కు చెందిన బాలచందర్‌కు ₹10,000 జరిమానా, రెండు రోజుల శిక్ష, అలాగే అబ్దుల్ గఫార్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ వివరాలను వెల్లడించిన బోధన్ పట్టణ ఎస్.హెచ్.వో వి. వెంకటనారాయణ, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

