Explore

Search

November 7, 2026 6:11 pm

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చంటి ఛానల్, బోధన్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఈ.వి. రంగారావు ఘనంగా ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ.. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ నుండి, 1980లో ఏర్పడిన బీజేపీ వరకు ఎందరో త్యాగధనుల కృషితో నేటికి పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక, రక్షణ, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందుతూ సుపరిపాలన దిశగా సాగుతోందని, ఇందూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలిపాక బాలరాజు, మీర్జాపూర్ అరవింద్, పవన్ కుమార్, స్వప్నిల్, హనుమాన్లు చారి, గంగాధర్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్