చంటి ఛానల్,బోధన్: మాజీ శాసనసభ్యుడు మొహ్మద్ షకీల్ అమీర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏక చక్రేశ్వర శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, షకీల్ అమీర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెర్క రామకృష్ణ, అడ్లూరి నరేష్, బాకోళ్ల శివ, వెంకటేష్, అజయ్, అంబం శివకుమార్, రజక మీర్జాపురం హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

