చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 250 మందితో ర్యాలీని చేపట్టారు. బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ జ్యోతి శంకర్, వార్డు సభ్యులతో పాటు అన్నోళ్ల సాయిలు, బాగారే నగేష్, నాగేష్, అన్నోళ్ల గంగారాం, బాగారే పరమేశ్వర్, బాగారే బాబయ్య, సిహెచ్ మరాయ్య, ఎం చందు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు.

