Explore

Search

November 7, 2026 6:23 pm

బోధన్ ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ గాల్లోకి.. ఉన్నతాధికారుల నిఘా ఏదీ?

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన కొందరు ఉద్యోగుల ప్రవర్తన, వేషధారణపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సేవలందించే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉంటూ కనీస హుందాతనం, మర్యాద పాటించకుండా విచిత్రమైన వేషధారణలతో కనిపించడమే కాకుండా, నోట్లో బబుల్‌గమ్‌లు, చాక్లెట్లు నములుతూ ప్రజలతో నిర్లక్ష్యంగా మాట్లాడుతుండటంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్యులతో మర్యాదగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తించడం ప్రభుత్వ వ్యవస్థల పరువు తీసేలా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది డ్రెస్సింగ్ కోడ్, ప్రవర్తనా నియమావళిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్