చంటి ఛానల్,తెలంగాణ: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ, కవితకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా నేరం నిరూపితం కాలేదని, వారు తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

