చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ లోని అనిల్ టాకీస్ – బెల్లాల్ మార్గంలో ప్రాణసంకటంగా మారిన బురద రోడ్డు దుస్థితిపై ‘చంటి ఛానల్’ ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. నిన్నటివరకు నరకాన్ని తలపించిన ఆ మురికి రోడ్డును, ఈ వార్త ప్రభావంతో వెంటనే మరమ్మతులు చేసి సురక్షితంగా మార్చారు. తమ సమస్యకు సత్వర పరిష్కారం చూపిన అధికారులకు, అలాగే తమ గొంతుకగా నిలిచిన చంటి ఛానల్‌కు స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

