చంటి ఛానల్,నిజామాబాద్: హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సౌజన్యంతో బోధన్ లయన్స్ ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌లో మొత్తం 177 మందికి (80 మంది పురుషులు, 97 మంది మహిళలు) వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ అదీబా అలీ, డాక్టర్ మాన్విత, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రశాంత్ బృందం ఆధ్వర్యంలో 62 పాప్ స్మియర్, 41 మామోగ్రఫీ, 27 అల్ట్రాసౌండ్, 13 ఎక్స్-రే, 5 సోనో పరీక్షలు ఉచితంగా చేపట్టారు. ముందస్తు స్క్రీనింగ్తోనే క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేయగా, ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు లయన్ బసవేశ్వరరావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

