Explore

Search

November 7, 2026 6:07 pm

బరితెగించిన గంజాయి బ్యాచ్.. ప్రభుత్వ కార్యాలయాల ముందే బహిరంగంగా ‘దమ్ము’!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో గంజాయి బ్యాచ్ బరితెగించి, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనే బహిరంగంగా మత్తులో జోగుతోంది. పట్టణంలోని ఎంపీడీవో, విద్యాశాఖ కార్యాలయాలతో పాటు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ‘భవిత కేంద్రం’ ప్రాంగణంలో యువకులు గుంపులుగా చేరి యథేచ్ఛగా గంజాయి నింపుతూ సేవిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ భవనాల ముందే ఇంత నిర్భయంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నా నిఘా కరువైందని స్థానికులు మండిపడుతున్నారు; వెంటనే పోలీస్ శాఖ నిజామాబాద్ సీపీ ప్రత్యేక దృష్టి సారించి, గంజాయి తాగుతున్న, సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్