Explore

Search

November 8, 2026 7:37 pm

బోధన్ బిఎస్పీ అసెంబ్లీ కమిటీ రద్దు: త్వరలో నూతన కమిటీ ప్రకటన

చంటి ఛానల్,నిజామాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) పునర్నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీని రద్దు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సింగాడే పాండు ఆదివారం ప్రకటించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కమిటీని రద్దు చేస్తూ త్వరలోనే పూర్తిస్థాయిలో నూతన కమిటీని ఎంపిక చేసి ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బోధన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్