Explore

Search

November 7, 2026 6:07 pm

బోధన్ బిగ్ బ్రేకింగ్: కెమికల్ ఫ్యాక్టరీ, భూములు సీజ్.. రంగంలోకి ఈగల్ ఫోర్స్!

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన భారీ ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. బోధన్ కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్ సిండికేట్‌కు చెందిన 15 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. కోట్ల విలువైన 32.5 కిలోల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ దందా ద్వారా నిందితులు అక్రమంగా కూడబెట్టిన ఒక కెమికల్ ఫ్యాక్టరీ, 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, 4 కార్లు, 2 బైకులు సహా మార్కెట్‌లో దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులను అధికారులు గుర్తించి, ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 68(F) కింద వాటిని జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న ఈ మాఫియా వెనుక ఉన్న కీలక సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్