Explore

Search

November 7, 2026 6:22 pm

క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం.. ఫ్లోరోసెన్స్ గైడెడ్ రోబోటిక్ సర్జరీ

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో యశోద హాస్పిటల్ (హైటెక్ సిటీ) సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. రోబోటిక్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ ఆధునిక విధానంలో కేవలం 8 ఎంఎం రంధ్రాల ద్వారా అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను మాత్రమే తొలగిస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతినదు. రోగులకు నొప్పి, రక్తస్రావం తక్కువగా ఉండి, త్వరగా కోలుకుని మెరుగైన జీవన నాణ్యతను పొందుతారని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్