చంటి ఛానల్, ఇందూర్: ధర్మ పరిరక్షణే లక్ష్యంగా యోగ్ ధారణ ఫౌండేషన్, తెలంగాణ సాధు పరిషత్మ, శ్రీ రామ్ హనుమాన్ సేన సంయుక్త ఆధ్వర్యంలో భీమ్‌గల్ పురాణిపేటలోని ప్రసిద్ధ బాబా రాజన్న ఆశ్రమం నుండి ‘చలో భద్రాచలం తలంబ్రాల’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ పవిత్ర యజ్ఞంలో భాగంగా జిల్లావ్యాప్తంగా భక్తుల నుండి బియ్యాన్ని సేకరించి, మార్చి 27న భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. అనంతరం హనుమాన్ జయంతి పర్వదినాన భద్రాచలం నుండి తీసుకువచ్చిన ఆ కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరుతున్నారు.

