చంటి ఛానల్,నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బీజేవైఎం) ఇందూర్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా భాను గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. బీజేవైఎం ఇందూర్ జిల్లా అధ్యక్షుడు రత్నగిరి వంశీ గౌడ్ జారీ చేసిన ఈ పత్రంలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు పార్టీ నాయకత్వానికి భాను గౌడ్ ధన్యవాదాలు తెలియజేయగా, పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

