చంటి ఛానల్,బోధన్: హైదరాబాద్లో నిర్వహించే ‘స్వర్ణకార గర్జన’కు బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణకారులు భారీగా తరలివెళ్లారు. స్వర్ణకారుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, జిల్లా కోశాధికారి సల్లూరువార్ అశోక్ చారి, పట్టణ అధ్యక్షుడు బొప్పాపూర్ హనుమాన్లు చారి, నాయకులు ప్రభాకర్ చారి, కాళిదాసు చారి, త్రివేణి నాగరాజు, నారాయణ చారి, వెంకటరమణాచారి, శ్రీనివాస్ చారి, నరేందర్ చారి, కిషోర్ చారి, రాజశేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

