Explore

Search

November 7, 2026 6:21 pm

మున్నూరు కాపులకు ప్రభుత్వాల మోసం: డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ధ్వజం

చంటి ఛానల్,బోధన్: మున్నూరు కాపులకు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, వారి సంఖ్య 50 లక్షలకు పైగా ఉంటే కులగణనలో కేవలం 13 లక్షలుగా చూపడం శోచనీయమని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అన్నారు. శుక్రవారం బోధన్‌లో సంఘం సభ్యత్వ నమోదు వెబ్‌సైట్, పోస్టర్‌లను ఆయన ఆవిష్కరించారు. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకుని మున్నూరు కాపుల బలాన్ని పాలకులకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తోట శ్రీనివాస్, రామరాజు, మందర్న రవి, సిర్ప సుదర్శన్, మాసుల శ్రీనివాస్, సుర పోతన్న, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్