చంటి ఛానల్,బోధన్: అయోధ్య కాలనీలోని అయోధ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి వేలంపాట కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేలంపాటలో ప్రతిష్టాత్మక గణపతి లడ్డూను లింగాల లక్ష్మణ్ గౌడ్ రూ. 51,000లకు దక్కించుకున్నారు. అనంతరం నిర్వహించిన లక్ష్మీ మాలల వేలంపాటలో చాపరాల రాజశేఖర్ రూ. 27,000లకు ఒక మాలను సొంతం చేసుకోగా, మరో లక్ష్మీ మాలను లక్ష్మీరామ్మూర్తి రూ. 19,999లకు వేలంలో దక్కించుకున్నారు.

