Explore

Search

November 7, 2026 6:31 pm

బోధన్ మార్కెట్ పీఠం.. ‘పెద్దాయన’కు పరేషాన్!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్‌లోని ఇద్దరు బడా నేతల మధ్య మొదలైన పోటీ ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆ ఒక్క కుర్చీపై ఇద్దరు హేమాహేమీలు కర్చీఫ్ వేయడంతో, అసలు ఆ ఇద్దరు నాయకులు ఎవరబ్బా అంటూ కేడర్‌లో ఒకటే పరేషాన్ మొదలైంది! ఇద్దరూ పార్టీలో సీనియర్లే, పైగా ‘పెద్దాయన’కు అత్యంత కావలసిన ఆప్తులే కావడంతో.. పదవి ఎవరికివ్వాలో తేల్చుకోలేక ఆయన సైతం తీవ్ర డైలమాలో పడ్డారు. ఎలాగైనా పెద్దాయనను మెప్పించి కుర్చీ చేజిక్కించుకోవాలని ఇద్దరు నేతలు తెరవెనుక జోరుగా పావులు కదుపుతుండగా, చివరికి ఆ ఆశీర్వాద బలం ఎవరికి దక్కుతుందోనన్న సస్పెన్స్ ఇప్పుడు బోధన్‌లో తారాస్థాయికి చేరింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్