Explore

Search

November 7, 2026 6:06 pm

ఆదిత్య హైస్కూల్‌లో ఘనంగా గణేష్ నవరాత్రులు: అన్నప్రసాద వితరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఆదిత్య హైస్కూల్ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన గణపతికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు పాఠశాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, సుమారు 500 మంది విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ, నవరాత్రుల పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, కాలనీవాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్