Explore

Search

November 7, 2026 6:31 pm

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

చంటి ఛానల్,బోధన్: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచినపల్లి ఆధ్వర్యంలో విజేత జూనియర్ కళాశాలలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి లయన్ పి. బసవేశ్వర రావు, ఇతర విశిష్ట అతిథులు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అత్యున్నతమైనదని, ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పి. నాగయ్య, కళాశాల డైరెక్టర్ రమణారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు దుర్గారావు, శ్రీధర్, శ్యామ్ సుందర్, ఎస్. కృష్ణ మోహన్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్