Explore

Search

November 7, 2026 6:31 pm

శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్ వివాదం.. దిగొచ్చిన డాక్టర్: డీఎంహెచ్‌ఓకు సంచలన లేఖ!

చంటి ఛానల్,నిజామాబాద్: వైద్యారోగ్య శాఖాధికారి (DM&HO)కి ప్రముఖ వైద్యుడు డాక్టర్ పి. కృష్ణ ప్రసాద్ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. సెప్టెంబర్ 10న శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్ వద్ద సిబ్బంది సమక్షంలో సంయమనం కోల్పోయి మాట్లాడిన తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయన డీఎంహెచ్‌ఓకు లిఖితపూర్వక లేఖ సమర్పించారు. పని ఒత్తిడి పరిస్థితులు ఏవైనప్పటికీ ఆ ప్రవర్తన సమర్థనీయం కాదని, జిల్లా ఆరోగ్య శాఖపై తనకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని స్పష్టం చేస్తూ, తన క్షమాపణలను స్వీకరించి జిల్లా వైద్య సేవా విధుల్లో పూర్తి సహకారం అందించే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్