చంటి ఛానల్,బోధన్: ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి కుర్రె సదానంద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అతడు, బుధవారం “జాబ్ రావట్లేదు.. చనిపోతున్నా” అంటూ బాబాయ్‌కి లొకేషన్ మెసేజ్ పంపి, ఆలీసాగర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

