Explore

Search

November 7, 2026 6:30 pm

మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా – బోధన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు!

చంటి ఛానల్,బోధన్: లయన్స్ క్లబ్ బోధన్, శ్రీహరి సేవ ఆధ్వర్యంలో రాకాసిపేట్ లయన్స్ జనరల్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 11న (శుక్రవారం, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు) హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బృందంచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఇందులో వైటల్స్ పరీక్షలు (BP, GRBS, బరువు, SPO2, పల్స్ రేట్),

స్త్రీ రోగ నిపుణుల సలహాలు, ఎక్స్-రేలతో పాటు మహిళలకు పాప్ స్మియర్, బ్రెస్ట్ స్క్రీనింగ్ (40 ఏళ్ల లోపు), మామోగ్రఫీ (40 ఏళ్లు పైబడిన వారికి) పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేయనున్నారు; వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ పి. శ్రీధర్, జిల్లా క్యాన్సర్ సెక్రటరీ లయన్ రమాదేవి రెడ్డి తదితరులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్