చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలో అధికారుల తీరు చూస్తుంటే “మా డబ్బా మేమే కొట్టుకుంటాం.. మాకెందుకు మీడియా?” అన్న చందంగా మారింది; ప్రెస్ మీట్ పేరిట కనీసం మీడియా మిత్రులను పిలిచే శ్రమ కూడా తీసుకోకుండా, సొంత ఆఫీస్ సిబ్బందితో మొబైల్‌లో వీడియోలు తీయించుకుని వాట్సాప్ గ్రూపుల్లో పడేసి చేతులు దులుపుకునే సరికొత్త ‘డిజిటల్ మాయ’కు తెరలేపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులను పూర్తిగా విస్మరిస్తూ, అధికార-విపక్ష నాయకులు, బాబులు సైతం తమకు తామే భజన చేసుకుంటూ సాగిస్తున్న ఈ ‘ఏకపాత్రాభినయ’ ప్రహసనం ఇలాగే కొనసాగితే, రేపు ప్రజల సమస్యలను పాలకులకు చేరవేసే గొంతుక కరువై, చివరకు అధికారులు తమ వీడియోలను తామే చూసుకుంటూ మురిసిపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు.

