చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని సాయిబాబా ఆలయ శ్రీకృష్ణ మందిరం వద్ద యోగ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చిన్నారులు, మహిళల విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నిర్వహించిన ఉట్టి కొట్టే పోటీలు భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, విజేతలైన చిన్నారులకు ₹2,000, మహిళలకు ₹4,000, పెద్దలకు ₹6,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు హాజరైన ఈ వేడుకలను భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రతి ఏటా మరింత ఘనంగా నిర్వహిస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు ఉదయ మహారాజ్ తెలిపారు.

