చంటి ఛానల్,బోధన్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని బోధన్‌లోని క్రిసెంట్ హైస్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. “ప్లే – పెర్ఫార్మ్ – ఇన్స్పైర్” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, అంకితభావం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ దృఢంగా, ఆరోగ్యంగా ఎదగాలని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

