చంటి ఛానల్, నిజామాబాద్: ముధోల్కు చెందిన జింకొల్ల జ్యోతి-రమేష్ దంపతుల నవజాత శిశువు తీవ్ర అస్వస్థతతో నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి దీనస్థితిపై ‘మేముసైతం’ ఎన్జీఓ చైర్మన్ డా. నవీన్ కుమార్ గైని స్పందించారు. ఆ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం సంస్థ తరఫున తక్షణ సాయంగా రూ.5,000 అందించారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మరింత ఆర్థిక సాయం అవసరమున్నందున దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

