చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని మహా బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల నాయకులతో పాటు రెస్టారెంట్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

