చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ 01వ వార్డులోని జర్నలిస్టు కాలనీ జలమయమైన దుస్థితిపై వార్త వచ్చిన గంట వ్యవధిలోనే మున్సిపల్ అధికారులు స్పందించారు. తక్షణమే రంగంలోకి దిగిన సిబ్బంది, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనులు చేపట్టారు. అధికారుల వేగవంతమైన చర్యలపై హర్షం వ్యక్తం చేసిన పాత్రికేయులు.. భవిష్యత్తులో ఈ ముంపు సమస్య లేకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.

