Explore

Search

November 7, 2026 6:30 pm

ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు మండల స్థాయి ‘ప్రజావాణి’

చంటి ఛానల్, తెలంగాణ: రాష్ట్రం లో ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో ‘మండల స్థాయి ప్రజావాణి’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.4 జారీ చేసింది. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరించే ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సహా 23 మంది మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి. స్వీకరించిన ప్రతి అర్జీని ‘ప్రజావాణి పోర్టల్’లో నమోదు చేసి, ఫిర్యాదుదారులకు వెంటనే రసీదు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్