చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా బోధన్‌లోని క్రిసెంట్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-12 లాంగ్ జంప్ విభాగంలో 6వ తరగతి చదువుతున్న జైన్ ఉల్ అబిదీన్ ప్రథమ స్థానం సాధించగా, అండర్-8 బ్రాడ్ జంప్ విభాగంలో 3వ తరగతి విద్యార్థి షేక్ జైన్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత విజయంతో పాఠశాల కీర్తిని ఇనుమడింపజేసిన ఈ ఇద్దరు విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.

