చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పరిధిలోని అంబం గ్రామానికి చెందిన మహిపాల్ (28) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే మనస్తాపానికి గురై మహిపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు గురువారం రాత్రి బోధన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

