Explore

Search

November 7, 2026 6:52 pm

బోధన్ విద్యా హబ్‌ను కాపాడుకుందాం: విద్యార్థి సంఘాల కీలక పిలుపు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌ను విద్యా హబ్‌గా మార్చిన ప్రైవేట్ విద్యాసంస్థలను కొందరు విద్యార్థి సంఘాల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బతీస్తున్నారని BRSV, BVF, GVS సంఘాల నాయకులు ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో వారధిలా ఉండాల్సిన విద్యార్థి సంఘాలు, వాటిని సాకుగా చూపి యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం వల్ల విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు కొనసాగితే బోధన్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, విద్యార్థి సంఘాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్