Explore

Search

November 7, 2026 6:06 pm

బోధన్‌లో ఘనంగా 12వ జాతీయ యోగా దినోత్సవం: అబ్బురపరిచిన విద్యార్థుల ఆసనాలు

చంటి ఛానల్,​నిజామాబాద్: బోధన్ పట్టణంలో 12వ జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పతాంజలి జ్ఞాన యోగ సెంటర్, ఓం యోగాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఉదయం అంబేద్కర్ చౌరస్తా వద్ద పిల్లలు, పెద్దలు, స్థానిక ప్రముఖులందరూ కలిసి భారీ మానవహారంగా ఏర్పడి యోగా ప్రాముఖ్యతను చాటారు..

అనంతరం అక్కడి నుంచి అనిల్ టాకీస్ రోడ్, ఎక్స్ రోడ్స్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు దాదాపు 350 మందితో ‘వాక్ ఫర్ యోగా’ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. టీటీడీ కల్యాణ మండపంలో యోగా మాస్టర్లు మాధవి, గంగాధర్ ఆధ్వర్యంలో వారి శిష్యులు ప్రదర్శించిన కఠినమైన యోగాసనాలు అందరికీ కనువిందు చేస్తూ అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా యోగా మాస్టర్లు మాట్లాడుతూ..

నిత్య సాధనతో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం జయించవచ్చని, ప్రతిరోజూ యోగా చేస్తే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని ఆరోగ్య విశేషాలను వివరించారు.

​ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, పోలీస్ ఇన్స్పెక్టర్ (సీఐ) వెంకటనారాయణ, ఎంఈఓ నాగయ్య, ఆర్టీఓ అశ్వంత్ , రిటైర్డ్ ఎంఈవో బాలగంగాధర్, ఉషోదయ విద్యాసంస్థల ఎండీ సూర్య ప్రకాష్ దంపతులు, వంశీ విద్యాసంస్థల ఎండీ విజయ్ కుమార్ దంపతులు, వార్డ్ కౌన్సిలర్ దాము, అర్చకులు ఉదయ్ మహారాజ్, డాక్టర్ అరుణ్, సీనియర్ రిపోర్టర్ బలరామరాజు తదితరులు విచ్చేసి, వేదికపై స్వయంగా యోగాసనాలు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు..

ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని విచ్చేసిన ప్రముఖులు పిలుపునిచ్చారు. అందరికీ అల్పాహార విందుతో ఈ ఉత్సాహభరితమైన యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్