చంటి ఛానల్,హైదరాబాద్: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ముంపు ముప్పు తప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమయమైన బేగంపేట్ ప్రకాష్ నగర్లోని చీకోటి గార్డెన్స్, ఉప్పల్ జంక్షన్, ఎల్.బి. నగర్ ఎక్స్ రోడ్స్, వనస్థలిపురం కేఎల్ఎమ్ మాల్ తదితర లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీ ఆనంద్, హైడ్రా కమిషనర్ విశ్వనాధ్, స్థానిక సీపీ కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. భవిష్యత్తులో వరద సమస్యలు పునరావృతం కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు, సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచనలతో అధికారులు శాశ్వత పరిష్కార చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు.

