Explore

Search

November 7, 2026 6:44 pm

ఊరు చిన్నది.. షాపులు ఎనిమిది.. బెల్లాల్ గ్రామంలో ‘మందు’బాబులకే మహర్దశ!

చంటి ఛానల్,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామం ఇప్పుడు దేనిలో వెనకబడిందో లేదో కానీ, ‘బెల్ట్ షాపుల’ ఏర్పాటులో మాత్రం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది! వీధికో షాపు చొప్పున ఇంత చిన్న ఊళ్లో ఏకంగా 8 బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్ని‘బెల్లాల్ నీళ్లలా పారిస్తుంటే‘, మన ఎక్సైజ్ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని ‘చూసీ చూడనట్లు’ అద్భుతంగా నటిస్తున్నారని గ్రామ మహిళలు మండిపడుతున్నారు..

ఈ మందుబాబుల ఆగడాలు, అధికారుల నిర్లక్ష్యం భరించలేక మంగళవారం ఎక్సైజ్ ఆఫీసును ముట్టడిస్తే.. “మేము ఆఫీసులో ఉన్నామంటే, మేము మీ ఊళ్లో ఉన్నాం” అంటూ అధికారులు భలే కవర్ డ్రైవ్‌లు ఆడుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు..

​బోధన్ మొత్తానికి నీళ్లందించే ప్రసిద్ధ ‘బెల్లాల్ చెరువు’ ఉన్న ఈ ఊరిలో, పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపొద్దున ఆ చెరువులో నీళ్లకు బదులు ‘స్వచ్ఛమైన మద్యం’ పారుతుందేమో అని స్థానికులు, మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..

తమ బతుకులను రోడ్డున పడేస్తున్న ఈ ఎనిమిది బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని మహిళలు మొత్తుకుంటున్నా, ఈ ‘మద్యం పారే’ వింత గ్రామ వికాసాన్ని ఆపే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్