Explore

Search

November 7, 2026 6:30 pm

మందర్న, సాలంపాడ్ పంచాయతీ కార్యదర్శుల బదిలీ

చంటి ఛానల్,నిజామాబాద్:  బోధన్ మండలంలోని మందర్న గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సాలంపాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత ఇటీవల ప్రభుత్వ సాధారణ బదిలీలలో (జీవో నెంబర్ 38) భాగంగా వేరే గ్రామాలకు బదిలీ అయ్యారు. ఈ బదిలీ ప్రక్రియలో శ్రీనివాస్ ఎడపల్లి మండల్ మండల్ బ్రాహ్మణపల్లి కి వెళ్లగా, హరిత బోధన్ మండలంలోని మావంది కలాం గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. గత ఐదారేళ్లుగా తమ తమ పంచాయతీల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతలను సక్రమంగా, ఎంతో అంకితభావంతో నిర్వహించిన ఈ ఇరువురు కార్యదర్శుల సేవలను కొనియాడుతూ మందర్న, సాలంపాడ్ గ్రామస్తులు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్