చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి, 11 ఏళ్ల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కాంగ్రెస్ నేతలు (రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి) తమ హామీని విస్మరించారని కార్మిక సంఘాల నాయకులు రవిశంకర్ గౌడ్, ఉపేందర్ మండిపడ్డారు. నిరవధిక ‘లే-ఆఫ్’ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు దక్కకుండానే కార్మికులు రిటైర్ అవుతూ రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కవిత, మీడియా మిత్రులు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

