చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండలం తగ్గేల్లి గ్రామంలో పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ధర్మపరాయణురాలు, ప్రజాహిత పాలకురాలైన అహల్యాబాయి దేశానికి చేసిన సేవలను, ఆమె ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కురుమ సంఘం నాయకులు, గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

