చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డివిజన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణకు స్థానిక ఆర్డీవో విజయకుమారి, ఎంఆర్వో విట్టల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, సభ్యత్వ ప్రాధాన్యతను వివరించేందుకు సంస్థ ప్రతినిధుల బృందం మంగళవారం అధికారులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అధికారులు సానుకూలంగా స్పందిస్తూ.. తమ కార్యాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ అధికారులతోనూ సభ్యత్వ నమోదు చేయిస్తామని, తద్వారా రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, బోధన్ మండల చైర్మన్ కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

