చంటి ఛానల్,నిజామాబాద్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య గురువారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్, పార్కింగ్, భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలందరూ సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ ఎస్.హెచ్.వో వెంకట్ నారాయణ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

