Explore

Search

November 7, 2026 6:11 pm

పశువులకు ఆరోగ్య పత్రాలు తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

చంటి ఛానల్,బోధన్: బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సాటాపూర్ పశువుల సంతను, వెటర్నరీ చెకింగ్ పాయింట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల రవాణా వాహనాలను పరిశీలించిన సీపీ, విక్రయించే జంతువులకు వెటర్నరీ వైద్యుల ఆరోగ్య ధృవపత్రాలు తప్పనిసరని స్పష్టం చేశారు. అక్రమ రవాణా, అనారోగ్య పశువుల విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, పోలీసులు-వెటర్నరీ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని, అనుమానాస్పద సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరిన ఈ తనిఖీల్లో ఏసీపి శ్రీనివాస్, ఎస్ఐ చంద్రమోహన్, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్