చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ ఆర్టీసీ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం డిపో కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులుగా యాదగిరి, సెక్రటరీగా సంజీవరెడ్డి (కండక్టర్), చైర్మన్‌గా జి. రాములు (సీనియర్ అసిస్టెంట్) ఎంపికయ్యారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా, ఐక్యతతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నూతన ప్రతినిధులు స్పష్టం చేశారు.

