Explore

Search

November 7, 2026 6:30 pm

సిగ్నల్ లేని బోధన్: బాన్సువాడ స్పీడు.. బోధన్ కు తలనొప్పి!

చంటి ఛానల్,బోధన్: దశాబ్దాల చరిత్ర కలిగిన బోధన్ మున్సిపాలిటీ ట్రాఫిక్ నిర్వహణలో వెనుకబడి ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న మున్సిపాలిటీగా ఏర్పడిన బాన్సువాడలో సైతం అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిసి వాహనాల రాకపోకలు సజావుగా సాగుతుంటే, బోధన్‌లో మాత్రం నేటికీ ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయం. గతంలో పోలీసు అధికారులు ఆచన్ పల్లి, శక్కర్ నగర్, కొత్త బస్టాండ్ వంటి ఆరు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ అవసరమని నివేదించినా.. పాలకులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం పట్టణ వెనుకబాటుతనానికి నిదర్శనమని మేధావులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి, పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి పట్టణ రూపురేఖలు మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్