చంటి ఛానల్,బోధన్: సాలూర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడివో శ్రీనివాస్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ.. మండలంలో NFBS లబ్ధిదారుల నమోదు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ కూలీల సమీకరణ పెంచాలని, మరణాల రిజిస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని ఆయన సూచించారు.

