Explore

Search

November 7, 2026 6:10 pm

రైతు వేదికలో విద్యుత్ అవగాహన సదస్సు

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘రైతు వారం’ సదస్సులో ఏడీఈ కే. నగేష్ కుమార్ మాట్లాడుతూ, రైతులు PM Kusum పథకాల ద్వారా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఏటా లక్షల రూపాయల అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. వ్యవసాయ మోటార్లు, గృహాల వద్ద నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలని, ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా ఎర్థింగ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తిరుమల ప్రసాద్, ఏఈలు నాయిని కృష్ణ, మారుతి,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్