చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై భాస్కరాచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పాత వివాదం కేసులో సెక్షన్లను తగ్గించేందుకు ఓ బాధితుడి నుంచి ₹7,000 డిమాండ్ చేయగా, ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించిన అధికారులు, ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు . భాస్కరాచారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

